Tirupati: క్రమశిక్షణే పునాది ప్రపంచ స్థాయి కొలువులే లక్ష్యం: మోహన్ బాబు!
Tirupati: తిరుపతి జిల్లా రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో నూతన విద్యార్థులు, తల్లిదండ్రులతో ఛాన్సలర్ డాక్టర్ మంచు మోహన్ బాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
Tirupati: క్రమశిక్షణే పునాది ప్రపంచ స్థాయి కొలువులే లక్ష్యం: మోహన్ బాబు!
తిరుపతి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీలో గురువారం యూనివర్సిటీ ఓపెన్ ఆడిటోరియంలో 2026-27. సంవత్సరం జాయిన్ అయినా విద్యార్థి లు వారి తల్లిదండ్రులతో కలిసి డాక్టర్ మోహన్ బాబు గురువారం ఆత్మీయ సమావేశం పాల్గొన్నారు. విద్యార్థులు ఉద్దేశించి మోహన్ బాబు మాట్లాడుతూ
క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యే తమ ప్రధాన ధ్యేయమని, క్యాంపస్‌లో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి తన బిడ్డతో సమానమని ప్రముఖ విద్యావేత్త, మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్స్‌లర్ డాక్టర్ మంచు మోహన్ బాబు పేర్కొన్నారు. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నామని ఆయన తెలిపారు.
అంతేకాకుండా, సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేయాలనుకునే విద్యార్థులకు ఆయన ఒక గొప్ప వరాన్ని ప్రకటించారు. యూనివర్సిటీలో చదువుకుని ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి ఉన్నత సివిల్ సర్వీస్ ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యం ఉన్న విద్యార్థులకు సంస్థ తరఫున పూర్తిగా ఉచిత శిక్షణ అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రకటనతో ప్రాంగణమంతా విద్యార్థులు, తల్లిదండ్రుల హర్షధ్వానాలతో మారుమోగింది.
తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తమ పిల్లలను యూనివర్సిటీకి పంపిస్తున్నారని, వారి ఆశయాలను నిజం చేసే బాధ్యత తమపై ఉందని ఛాన్స్‌లర్ స్పష్టం చేశారు. విద్యాప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ఆత్మీయ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పి.వి. రమణ, రిజిస్ట్రార్ సారథి, ఫైనాన్స్ ఆఫీసర్ రవిశంకర్, వివిధ విభాగాల డీన్స్, అధ్యాపకులు, సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.




