Tirupati: మోహన్ బాబు వర్సిటీలో నేటి నుంచి 'మోహన మంత్ర'!
Tirupati: మోహన్ బాబు యూనివర్సిటీలో జాతీయ స్థాయి టెక్నో-కల్చరల్ ఫెస్టివల్ 'మోహన మంత్ర' శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నట్లు వీసీ డాక్టర్ పి.వి. రమణ వెల్లడించారు.
Tirupati: మోహన్ బాబు వర్సిటీలో నేటి నుంచి 'మోహన మంత్ర'!
తిరుపతి: మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి టెక్నో-కల్చరల్ ఫెస్టివల్ పేరుతో ''మోహన మంత్ర' శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని వైస్ ఛాన్సలర్ పివి రమణ, రిజిస్ట్రార్ సారథి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ ఛాన్సలర్ మంచు మోహన్ బాబు, ప్రో చాన్సలర్ మంచు విష్ణు, డైరెక్టర్ వినయ్ మహేశ్వరి లు ముఖ్య అతిధులుగా పాల్గొంటారని తెలిపారు.
సృజనాత్మకత నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను, టెక్నికల్ ఇన్నోవేషన్స్‌ను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు వారు వెల్లడించారు.
కేవలం చదువుకే పరిమితం కాకుండా, టెక్నికల్ ప్రాజెక్ట్‌లు, కోడింగ్ కాంపిటీషన్స్ తో పాటు నృత్యం, సంగీతం, ఫ్యాషన్ షో, షార్ట్ ఫిలిం మేకింగ్, వివిధ రకాల ఆటలు, విభిన్న సాంస్కృతిక పోటీల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడం, ఫ్లాష్ మాబ్, లెట్స్ నాచో డాన్స్ పోటీ, బ్యాండ్ బ్యాటిల్, టగ్ ఆఫ్ వార్, గల్లీ క్రికెట్, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ వర్క్‌షాప్‌లు, టెక్ ఎక్స్పో, ఆర్సీ కార్ రేస్, ఈ-స్పోర్ట్స్, మోటో షో, రకెట్ రష్, యుక్తి హ్యాకాథాన్, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ స్క్రీనింగ్, లైవ్ బ్యాండ్ ప్రదర్శన వంటి పలు ఈవెంట్స్ జరగనున్నాయి.
అలాగే రెండవ రోజు వెల్కం, డాన్స్ వామ్-అప్, బ్యాండ్ బ్యాటిల్ ఫైనల్స్, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ షోకేస్, టగ్ ఆఫ్ వార్, గల్లీ క్రికెట్ ఫైనల్స్, క్లే మోడెల్లింగ్, లైఫ్ సేవర్ లాబ్, డ్రోన్-ఎక్స్ ఛాలెంజ్, బ్రిడ్జ్-ఓ-మానియా, హ్యాక్-స్ప్రింట్, క్యాడ్ మాస్టర్స్ ఫైనల్ రౌండ్, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఫైనల్ డిస్ప్లే, ఓపెన్ మైక్, రాంప్ వాక్, డిజే షో వంటి ఎన్నో ఆసక్తికరమైన సాంస్కృతిక, సాంకేతిక, వినోదాత్మక ఈవెంట్లు నిర్వహణ ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
అలాగే విద్యార్థులు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు, వారిలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, టీమ్‌వర్క్, భావప్రకటన స్వేచ్ఛను పెంపొందించడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుందన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కాలేజీలు, యూనివర్సిటీల నుంచి వేలాది మంది విద్యార్థులను ఒక్కచోటుకి చేర్చి, వారి మధ్య సాంస్కృతిక, విజ్ఞాన మార్పిడికి ఒక వేదికను అందించడం, విద్యార్థులకు చదువుతో పాటు ఉత్సాహాన్ని, వినోదాన్ని పంచుతూ వారి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే ఒక వేడుకే ఈ 'మోహన మంత్ర'. అని అన్నారు.




