Tirupati: రాష్ట్ర స్థాయి క్రీడల్లో మోటుపల్లి చాందిని ప్రతిభ

Tirupati: ఆంధ్రప్రదేశ్ 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) రాష్ట్ర స్థాయి పోటీల్లో మోటుపల్లి చాందిని తృతీయ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 12 Oct 2026 7:04 PM IST
Tirupati
X

Tirupati: రాష్ట్ర స్థాయి క్రీడల్లో మోటుపల్లి చాందిని ప్రతిభ

Tirupati: ఆంధ్రప్రదేశ్ 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్. జి. ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో క్రీడాకారిణి మోటుపల్లి చాందినీ అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు తృతీయ స్థానం దక్కించుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో చాందినీ అద్భుతమైన ప్రతిభ కనపరచి, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు.

రాష్ట్ర స్థాయిలో రాణించి జాతీయ స్థాయికి ఎంపికైన సందర్భంగా తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి చాందినీని అభినందిచి, త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో కూడా మోటుపల్లి చాందినీ పతకం సాధించి రాష్ట్ర కీర్తిని ఇనుమడింపజేయాలని పలువురు ఆకాంక్షిస్తూ, ఆమెకు శిక్షణ ఇచ్చిన కోచ్‌ కిరణ్ ను, ప్రోత్సహించిన తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL