Tirupati: 5వ వార్డులో పింఛన్ల పంపిణీ: లబ్ధిదారులకు టీడీపీ నేతల భరోసా!
Tirupati: పట్టణంలోని 5వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో రవిచంద్ర, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
Tirupati: 5వ వార్డులో పింఛన్ల పంపిణీ: లబ్ధిదారులకు టీడీపీ నేతల భరోసా!
Tirupati: రేణిగుంట పట్టణంలోని 5వ వార్డులో నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో రవిచంద్ర, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ మొత్తాలను అందజేశారు. అనంతరం పింఛన్‌దారులతో ఎంపీడీవో రవిచంద్ర మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పింఛన్‌దారులకు ఎదురయ్యే సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో శశిరేఖ, మహేష్‌తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పింఛన్‌దారులు పాల్గొన్నారు.
Next Story




