Obulavaripalli: ఓబులవారిపల్లి ఎంపీపీగా ముక్కా సాయి వికాస్ రెడ్డి ప్రమాణం!
Obulavaripalli: రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి ఎంపీపీగా గురువారం ముక్కా సాయి వికాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా ఎమ్మెల్యే శ్రీధర్ సన్మానించారు.
Obulavaripalli: ఓబులవారిపల్లి ఎంపీపీగా ముక్కా సాయి వికాస్ రెడ్డి ప్రమాణం!
రైల్వే కోడూరు నియోజకవర్గం: ముక్కావారిపల్లిలోని తమ నివాసం నుంచి ఓబులవారిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వరకు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి తనయుడు శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు*ముక్కా వరలక్ష్మి గారు, ముక్కా విశాల్ రెడ్డి గారు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహభరిత నినాదాల మధ్య భారీ ర్యాలీగా చేరుకున్నారు. అడుగడుగునా లభించిన ఘన స్వాగతంతో విజయోత్సవ వాతావరణం నెలకొంది.
అనంతరం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీటీసీల మద్దతుతో శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు ఎంపీపీగా ఎన్నికయ్యారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారికంగా ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసి, అధికారుల సమక్షంలో సంబంధిత పత్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల భారీ సమక్షంలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపీపీగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన ముక్కా సాయి వికాస్ రెడ్డి గారిని రైల్వే కోడూరు శాసనసభ్యుల శ్రీధర్ గారు మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాలు కప్పి, పూల బొకేలు అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ విజయం ఆయన నాయకత్వంపై ఎంపీటీసీలు ఉంచిన విశ్వాసానికి, కూటమి ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన ముక్కా సాయి వికాస్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు!




