Naidupet: నూతన రైతు బజార్ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఏఎంసీ

Naidupet: నాయుడుపేటలో నూతన రైతు బజార్ నిర్మాణానికి ముందడుగు. టిడ్కో ఇళ్ల సమీపంలో స్థలాన్ని పరిశీలించిన ఏఎంసీ ఛైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ మరియు అధికారులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Sept 2026 4:17 PM IST
Naidupet
X

Naidupet: నూతన రైతు బజార్ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఏఎంసీ

నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేట లో AMC చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ నూతన రైతు బజార్ నిర్మాణ అంచనాల కోసం వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) మరియు సంబంధిత ఇంజనీరింగ్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఈరోజు స్థల పరిశీలన చేసి, కొలతలు తీసుకోవడం జరిగింది. టిడ్కో (TIDCO) గృహాల సమీపంలో ఈ రైతు బజార్‌ను నిర్మిస్తే అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావించి, ఆ స్థలాన్ని కేటాయించాలని సంబంధిత ప్రభుత్వ అధికారులను కోరడం జరిగింది.

ఈ రైతు బజార్ ల ప్రణాళిక ఎప్పటినుండో నాయుడుపేటలో ఏర్పాటు చేయాలని ఉందని అయితే ఎవరు దానిని నిర్మాణ కార్యక్రమంగా తీసుకువచ్చేందుకు ముందు రాలేదని అయితే ప్రస్తుత AMC చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ రైతు బజార్లను నాయుడుపేటలోని టిట్కో ఇళ్ల వద్ద త్వరిత గతిన ఏర్పాటు చేయడం జరుగుతుంది AMC కార్యాలయ సిబ్బంది తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో వ్యవసాయ మార్కెట్ కమిటి ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటి సిబ్బంది, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్