Naidupet: పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు జనసేన ఏర్పాట్లు
Naidupet: నాయుడుపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని జనసేన ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పిలుపునిచ్చారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.
Naidupet: పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు జనసేన ఏర్పాట్లు
నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు కోణిదల పవన్ కళ్యాణ్ జన్మదినం ఈనెల 2వ తేదీన పురస్కరించుకొని జన్మదిన వేడుకలకు జనసేన పార్టీ నాయకులు జనసైనికులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు సిద్ధంగా ఉండాలని సూళ్లూరుపేట జనసేన పార్టీ ఇంచార్జ్ నాయుడుపేట ఏఎంసి చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ పిలుపునిచ్చారు.
ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు లో భాగంగా ఈనెల 2వ తేదీ ఉదయం 9.00 గంటలకు నాయుడుపేట లోని గాంధీ మందిరం వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు అక్కడినుండి శ్రీకాళహస్తి బైపాస్ లో గల జనసేన పార్టీ కార్యాలయం వద్దకు బైక్ ర్యాలీ ఉంటుందని అనంతరం వర్చువల్ గా ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తిలకించడం జరుగుతుందని నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ తెలియపరచడం జరిగింది.
ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల వేళ ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో జనసేన పార్టీ నాయకులు జనసేనకులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ముఖ్యంగా జనసైనికులు పాల్గొనే సేవా కార్యక్రమాలలో జనసైనికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా జనసేన పార్టీ నాయకులు చర్యలు తీసుకోవాలని మునుపెన్నడూ లేని విధంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఘనంగా జరిపించాలని ఆయన తెలియజేయడం జరిగింది.




