Naidupet: నాయుడుపేట బాలికల పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం

Naidupet: తిరుపతి జిల్లా నాయుడుపేట జడ్పీ బాలికల పాఠశాలలో మెగా పీటీఎంలో పాల్గొన్న ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ. విద్యార్థుల ప్రగతిపై ప్రత్యేక చర్చ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 July 2026 6:26 PM IST
Naidupet
X

Naidupet: నాయుడుపేట బాలికల పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం

నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేట లోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మెగాపేరెంట్స్ సమావేశంలో పాల్గొన్న సూళ్లూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయ్ శ్రీ, ఎంఈఓ2 మునిరత్నం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మెగా పేరెంట్స్ సమావేశంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొనడం.

అటు విద్యార్థుల్లోనూ ఇట తల్లిదండ్రులలోను పాఠశాల పట్ల మరియు ఉపాధ్యాయుల పట్ల అవగాహన కలిగే విధంగా ఈ సమావేశం ఉపయోగపడుతుందని విద్యార్థులు పాఠశాలలో ఎలా మెలగాలో ఉపాధ్యాయులు నేర్పిస్తే సమాజంలో ఎలా మెలగాలన్నది వారి తల్లి తండ్రులు నుండి విద్యార్థులకు తెలుస్తుందని వారు ఇరువురు ఇలాంటి సమావేశాలలో కలిసి పాల్గొనడం ద్వారా విద్యార్థుల పట్ల వారి చదువులు పట్ల, వారి ప్రవర్తన పట్ల ఒక అవగాహన తల్లిదండ్రులుకు ఉపాధ్యాయులకు ఉంటుందని తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎంఎల్ఎ విజయ్ శ్రీ తెలియజేస్తూ విద్యార్థులు క్రమశిక్షణ తో మెలిగి అటు చదువుల్లోను మరియు ప్రవర్తనలోనూ అభ్యున్నతి సాధించే విధంగా ఉండాలని ఇలాంటి విషయాలు లో వారి తల్లిదండ్రులు వారికి అండా గా ఉండి వారి ఉన్నతికి తోడ్పడాలని అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మెగా పేరెంట్స్ సమావేశం లను ఏర్పాటు చేయడం జరుగుతుందని,

అలాగే ఉపాధ్యాయులు కూడా కొంచం చదువు లో వెనుకబడిన వారి పట్ల శ్రద్ధ చూపాలని విద్యార్థులు లో పాఠశాలలో ఎటువంటి నిరాశకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పట్ల ఉందని ఆమె తెలియజేశారు, రాష్ట్ర ప్రభుత్వం అందుకే ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థుల ఉన్నతి కి మార్గాలు సుగమం చేసే విధంగా అవకాశాలను కల్పిస్తూ ఉందని ఈ సందర్భంగా ఎంఎల్ఏ విజయ్ శ్రీ తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story