Naidupet: ఉత్తమ సేవలకు గాను అవార్డు అందుకున్న సీఐ సంగమేశ్వరరావు
Naidupet: 80వ స్వాతంత్ర వేడుకల్లో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వర రావు.
Naidupet: ఉత్తమ సేవలకు గాను అవార్డు అందుకున్న సీఐ సంగమేశ్వరరావు
నాయుడుపేట: తిరుపతి జిల్లా నాయుడుపేట రూరల్ సీఐ గా పని చేస్తున్న సంగమేశ్వర రావు కు 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లాలో ఉన్నత సేవలకు గాను అందించే అవార్డును తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రమును అందించడం జరిగింది.
నాయుడుపేట రూరల్ అయినా ఓజిలి, పెళ్ళాకూరు, దొరవారిసత్రం మండలాలలో ఉన్నతమైన సేవలు అందించడం మరియు క్రైమ్ రేటును తగ్గించడం మరియు వేసవికాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి సేవా కార్యక్రమాలకు గాను ఆయనను 80వ స్వాతంత్ర దినోత్సవ అవార్డులలో ప్రశంస పత్రంతో సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు డిఎస్పి చెంచు బాబు ఆధ్వర్యంలో తాను పనిచేయడం తోనే తాను ఈ అవార్డుకు ఎన్నికవ్వడం కారణమని అలాగే తోటి పోలీసు అధికారుల సహాయ సహకారాలు కూడా ఇందుకు కారణం అని నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఈ అవార్డుతో తనను సత్కరించడం సంతోషించేదగిన విషయమని నాయుడుపేట రూరల్ లో భాగమైన ఓజిలి, పెళ్ళకూరు, దొరవారి సత్రం మండలాలలో సామాన్య ప్రజలు కారణాల వలన ఇబ్బందులకు గురి అయిన, న్యాయం కోసం ఈ మూడు మండలాల పోలీస్ స్టేషన్లకు ప్రజలు వచ్చిన తాను వెంటనే స్పందించే విధంగా నడుచుకుంటానని ఆయన తెలియపరచడం జరిగింది.




