Naidupeta: రాష్ట్రస్థాయి చెస్ టోర్నీ.. విజేతలకు బహుమతుల ప్రదానం!
Naidupeta: నాయుడుపేటలో సమస్త్రా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఎపి స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్. విజేతలకు బహుమతులు అందజేసిన ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్.
Naidupeta: రాష్ట్రస్థాయి చెస్ టోర్నీ.. విజేతలకు బహుమతుల ప్రదానం!
Naidupeta: సమస్త్రా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ - విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన నాయుడుపేట AMC చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్.
సమస్త్రా స్పోర్ట్స్ అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్–2026 సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నాయుడుపేటలోని ప్రకృతి విద్యా పాఠశాలలో, చిన్న దర్గా ఎదురుగా నిర్వహించారు.
నాయుడుపేట AMC డైరెక్టర్ కామిరెడ్డి కేశవరెడ్డి మరియు వారి కుమారుడు సమస్త్రా స్పోర్ట్స్ డైరెక్టర్ కామిరెడ్డి మహేంద్ర ఆహ్వానం మేరకు నాయుడుపేట AMC చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కామిరెడ్డి మహేంద్ర , ఉయ్యాల ప్రవీణ్ ని శాలువాతో సత్కరించారు. అనంతరం ఉయ్యాల ప్రవీణ్ విజేతలకు బహుమతులు ప్రధానం అంద చేశారు.
ఈ ఈవెంట్ లో ఈవెంట్ ఆర్గనైజర్లు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెస్ క్రీడాకారులు, క్రీడాకారుల తల్లితండ్రులు, తదితరులు పాల్గొన్నారు.




