Naidupeta: నాయుడుపేటలో రేపే మహాకాల్ విఘ్నేశ్వరుడి నిమజ్జనం!

Naidupeta: నాయుడుపేట దర్గా వీధి మహాకాల్ విఘ్నేశ్వరుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి. టీడీపీ నేత పొట్లపూడి రాజేష్ వ్యాఖ్యలు, ఎమ్మెల్యే విజయశ్రీకి కృతజ్ఞతలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 19 Sept 2026 11:26 AM IST
Naidupeta
X

Naidupeta: నాయుడుపేటలో రేపే మహాకాల్ విఘ్నేశ్వరుడి నిమజ్జనం!

Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేటలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పొట్లపూడి రాజేష్ ఆధ్వర్యంలో దర్గా వీధిలో ఏర్పాటుచేసిన మహాకాల్ విఘ్నేశ్వరుడి నిమజ్జనం రేపు జరుగుతున్నట్టు తెలియజేసిన మహాకాల్ విఘ్నేశ్వరుడి కమిటీ సభ్యులు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పోట్లపూడి రాజేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా దర్గా వీధిలో వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముఖ్యంగా విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సూళ్లూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ కి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్య కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అలాగే దర్గా వీధి లాంటి రద్దీ ప్రదేశాలలో విగ్రహ ఏర్పాటు చేసిన ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పుడు అందుబాటులో ఉండి ట్రాఫిక్కును నియంత్రించే విధంగా చర్యలు తీసుకున్న డిఎస్పి చెంచు బాబుకు మరియు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అలాగే దర్గా వీధిలో ఉన్న చుట్టుపక్కల వ్యాపారస్తులు మాకు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అలాగే రేపు మహాకాల్ విగ్రహ నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ పాల్గొని వినాయకుని కృపకు నోచుకోవాలని ఆ మహా కాల్ విగ్నేశ్వరుడు ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో పాటు ఆర్థికంగానూ ముందుకు వెళ్లే విధంగా ఆశీర్వదించాలని తాను కోరుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు తెలియజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్