Naidupeta: నన్ను ఆశీర్వదించండి: కూటమి అభ్యర్థి షేక్ షాకిరా

Naidupeta: నాయుడుపేట మున్సిపల్ కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ షాకిరా పట్టణ టీడీపీ అధ్యక్షుడు 786 రఫీ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి ఓటర్ల ఆశీస్సులు కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Oct 2026 11:53 PM IST
Naidupeta
X

Naidupeta: నన్ను ఆశీర్వదించండి: కూటమి అభ్యర్థి షేక్ షాకిరా

తిరుపతి జిల్లా: నాయుడుపేట లోని తెలుగుదేశం పార్టీ నాయుడుపేట పట్టణ అధ్యక్షులు 786 రఫీ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వం ఎన్నుకున్న నాయుడుపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థి షేక్ షాకీరా కీలక వ్యాఖ్యలు చేశారు. మొట్టమొదటిసారి రాజకీయాలలో పోటీ చేస్తున్నా తనను నాయుడుపేట మున్సిపాలిటీ ప్రజలు ఆశీర్వదించి తమ ఓటు వేసి గెలిపించాలని ఆమె తెలియజేశారు.

ఈ నాయుడుపేట మున్సిపాలిటీ స్థానిక ఎన్నికలలో సామాన్య కుటుంబానికి ధనవంతుల కుటుంబానికి మధ్య పోటీగా ఎన్నికలు జరగబోతున్నాయని అందువలన నాయుడుపేట మున్సిపాలిటీ ప్రజలు సామాన్యమైన మా కుటుంబం పై నమ్మకం ఉంచి తమ గెలుపుకు దోహదపడాలని వారు ప్రజలకు తెలియజేశారు.

ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా చేతనైనంత సహాయ సహకారాలు ప్రజలకు అందించిన కుటుంబం మాది అని ఇప్పటికీ నాయుడుపేటలో ఏ పేద కుటుంబానికి అయినా ఏ సామాన్య కుటుంబానికైనా అవసరమైతే ముందుండే ఏకైక నాయకుడు 786 రఫీ అని అలాంటి కుటుంబం నుండి వస్తున్న తనపై నమ్మకం ఉంచి తమ విజయానికి నాయుడుపేట మున్సిపాలిటీ ప్రజలు దోహదపడాలని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్