Renigunta: కార్యకర్తలే పార్టీకి అసలైన మూలస్తంభాలు.. మంత్రి నారా లోకేష్
Renigunta: రేణిగుంట మండలం కొత్తపాళెంలో టిడిపి కార్యకర్తల సమన్వయ సమావేశం. మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ.
Renigunta: కార్యకర్తలే పార్టీకి అసలైన మూలస్తంభాలు.. మంత్రి నారా లోకేష్
రేణిగుంట: రేణిగుంట మండలం ఎలమండ్యం పంచాయతీ పరిధిలోని కొత్తపాళెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో నిర్వహించిన కార్యకర్తల సమన్వయ సమావేశం ఘనంగా జరిగింది.
వేలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులు,అభిమానుల మధ్య సమావేశం విజయవంతమైంది.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, "కార్యకర్తలే పార్టీకి అధినేతలు.. వారే పార్టీకి అసలైన మూలస్తంభాలు" అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల కృషి ఎంతో కీలకమని, వారి సంక్షేమం,గౌరవానికి పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ,జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి నారా లోకేష్‌కు అపూర్వ స్వాగతం లభించిందన్నారు.దివంగత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేస్తూ,అదే స్ఫూర్తితో లోకేష్ నాయకత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.




