Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబరు 11 నుంచి 20 వరకు నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. విజయదశమినాడు గజవాహన సేవ నిర్వహించనున్నారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 10 Oct 2026 5:13 PM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

తిరుచానూరు: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబ‌రు 11 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ మ‌ధ్యాహ్నం 3 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 20వ తేదీ విజయదశమినాడు శ్రీపద్మావతి అమ్మవారు రాత్రి 7.45 గంట‌ల‌కు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు. న‌వ‌రాత్రి ఉత్స‌వాల కార‌ణంగా ఈ 10 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వంను ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది. అదేవిధంగా, అక్టోబ‌రు 16న ల‌క్ష్మీపూజ‌ సేవ‌లు రద్ద‌య్యాయి.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL