Tirupati: తిరుపతి కార్పొరేషన్‌పై కూటమి జెండా: జేబీ శ్రీనివాస్ గెలుపు

Tirupati: తిరుపతి నగరపాలక సంస్థలో ఎన్డీఏ కూటమి 60 స్థానాలు గెలుచుకుంది. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ 61,712 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 3 Nov 2026 7:35 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి కార్పొరేషన్‌పై కూటమి జెండా: జేబీ శ్రీనివాస్ గెలుపు

తిరుపతి: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధించింది. మొత్తం 66 డివిజన్లకు గాను టీడీపీ 36 స్థానాల్లో విజయం సాధించగా, మరో 2 స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. జనసేన 19, బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందాయి.

వైఎస్సార్‌సీపీ 3, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో విజయం సాధించారు. మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన టీడీపీకి చెందిన మన్యం శ్రీనివాస ప్రసాద్ అలియాస్ జేబీ శ్రీనివాస్ 61,712 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో తిరుపతి నగరపాలక సంస్థలో ఎన్డీఏ కూటమి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.

పార్టీల వారీగా గెలుపొందిన స్థానాలు:

* టీడీపీ – 36

* టీడీపీ ఏకగ్రీవం – 2

* జనసేన – 19

* బీజేపీ – 3

* వైఎస్సార్‌సీపీ – 3

* ఇండిపెండెంట్లు – 3

మొత్తం 66 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL