Tirupati: తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని కలిసిన ఎంపీపీ కళ్యాణి!
Tirupati: తిరుపతి రూరల్ నూతన ఎంపీపీ కత్తి కళ్యాణి భర్త సుధాతో కలిసి గురువారం తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Tirupati: తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని కలిసిన ఎంపీపీ కళ్యాణి!
Tirupati: చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా నూతనంగా ఎన్నికైన కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కత్తి కళ్యాణి గురువారం తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
తన భర్త కత్తి సుధా తో కలిసి తుడా ఛైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి ని కలిసిన ఎంపీపీ కత్తి కళ్యాణి , తమ ఎన్నికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి నూతనంగా ఎన్నికైన ఎంపీపీ కత్తి కళ్యాణి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఎంపీపీ కత్తి కళ్యాణి - కత్తి సుధా దంపతులను ఛైర్మన్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి, కూటమి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి అలిమినేని మధు, కూటమి నాయకులు పాల్గొన్నారు.




