Tirupati: తిరుపతి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ పరిశీలించిన ఐఏఎస్ అధికారి!
Tirupati: తిరుపతి జిల్లాలో ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల పరిశీలన అధికారి డాక్టర్ ఎం. వరప్రసాద్, ఐఏఎస్.
Tirupati: తిరుపతి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ పరిశీలించిన ఐఏఎస్ అధికారి!
Tirupati: తిరుపతి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ (ZPTC) మరియు ఎంపీటీసీ (MPTC) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించేందుకు ఎన్నికల పరిశీలన అధికారి డా. ఎం. వరప్రసాద్, ఐఏఎస్, బుధవారం జిల్లాలోని పలు మండలాలు, కార్యాలయాలను సందర్శించారు.
ఈ పర్యటనలో భాగంగా తిరుపతి డీఆర్‌డీఏ కార్యాలయంలో జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను, తిరుపతి రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రేణిగుంట, రామచంద్రపురం, వడమాలపేట, పుత్తూరు, నారాయణవనం, చంద్రగిరి మండలాల్లోని సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించి నామినేషన్ల ప్రక్రియను సమీక్షించారు. అలాగే పుత్తూరు మున్సిపల్ కార్యాలయాన్ని కూడా సందర్శించారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించడంలో భాగంగా ఈ పర్యటన చేపట్టారు. ఎన్నికల పరిశీలన అధికారి వెంట లైజన్ అధికారి శ్రీ ఎం. జనార్ధన రెడ్డి పాల్గొన్నారు.




