Obulavaripalli: గోవిందంపల్లె సర్పంచ్ ఏకగ్రీవం.. రూపానంద రెడ్డికి సత్కారం
Obulavaripalli: ఓబులవారిపల్లి మండలం గోవిందంపల్లె సర్పంచ్‌గా ఉప్పలపాటి శ్రీనివాసుల రాజు ఏకగ్రీవ ఎన్నిక; ముక్కా రూపానంద రెడ్డి దంపతులకు గజమాలతో ఘన సత్కారం.
Obulavaripalli: గోవిందంపల్లె సర్పంచ్ ఏకగ్రీవం.. రూపానంద రెడ్డికి సత్కారం
ఓబులవారిపల్లి: ఓబులవారిపల్లి మండలం గోవిందంపల్లె గ్రామ సర్పంచ్‌గా శ్రీ ఉప్పలపాటి శ్రీనివాసుల రాజు గారు ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం, గ్రామం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, నాయకులు తరలివచ్చి రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, KUDA చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారిని, శ్రీమతి ముక్కా వరలక్ష్మి గారిని, ఎంపీపీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, నాయకుల తరఫున ముక్కా రూపానంద రెడ్డి దంపతులకు భారీ గజమాల వేసి ఘనంగా సత్కరించారు. తమ విజయానికి మద్దతు, ప్రోత్సాహం అందించినందుకు శ్రీ ఉప్పలపాటి శ్రీనివాసుల రాజు గారు, గ్రామ నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో NDA కూటమి నాయుకులు, ప్రజలు పాల్కొన్నారు.




