Obulavaripalli: వై.కోట పంచాయతీలో ముక్కా వరలక్ష్మి ఎన్నికల ప్రచారం

Obulavaripalli: వై.కోట పంచాయతీలో ముక్కా వరలక్ష్మి విస్తృతంగా పర్యటించి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.

PRASAD, KODURU
Published on: 30 Oct 2026 10:36 PM IST
Obulavaripalli
X

Obulavaripalli: వై.కోట పంచాయతీలో ముక్కా వరలక్ష్మి ఎన్నికల ప్రచారం

ఓబులువారిపల్లె: ఓబులువారిపల్లె మండలంలోని వై.కోట పంచాయతీలో ముక్కా వరలక్ష్మి గారు విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఆమెకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు.

ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు, కూటమి బలపరిచిన Y.కోట-1 MPTC అభ్యర్థి బొబ్బె చందన గారు, ZPTC అభ్యర్థి కీర్తిపాటి కవిత గార్లకు మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రామ ప్రజలతో ఆత్మీయంగా మమేకమవుతూ స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ముక్కా రూపానంద రెడ్డి గారు అరవ శ్రీధర్ గారి నాయకత్వంలో కూటమి శ్రేణుల ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

PRASAD, KODURU

PRASAD, KODURU