Renigunta: రేణిగుంటలో బైకుల ప్రమాదం.. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 15 Jun 2026 5:44 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో బైకుల ప్రమాదం.. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు

రేణిగుంట: రేణిగుంట మండలం ఆంజనేయపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

రెండు మోటార్‌సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story