Srikalahasti: శ్రీకాళహస్తి పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నదానం

Srikalahasti: శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 86వ వారం అన్నదానం. పేదలకు, ప్రయాణికులకు భోజనం పంపిణీ.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 9 July 2026 3:53 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తి పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నదానం

శ్రీకాళహస్తి: జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌లో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరుతో 86వ వారపు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు పేదలు, ప్రయాణికులు, అవసరమైన వారికి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. సమాజ సేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం నిరంతరంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, మనీ, ప్రదీప్ కుమార్, లక్ష్మణ్, నవీన్, రమేష్ బాబు, జానీ, ముని చంద్ర, రాజా, చందుతో పాటు వీర మహిళలు, శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత, పేట శారద, నారాయణ గాయత్రి, బత్తెమ్మ, గోపిక, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story