Tirupati: తిరుపతి జిల్లా పోలీసుల వీడ్కోలు సభ

Tirupati: తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో పదవీ విరమణ పొందిన సిబ్బందికి ఘన వీడ్కోలు

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 31 May 2026 9:47 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి జిల్లా పోలీసుల వీడ్కోలు సభ

తిరుపతి: పోలీస్ శాఖలో పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బందికి ఘన వీడ్కోలు కార్యక్రమం. దశాబ్దాలపాటు విశిష్ట సేవలందించిన పోలీసు సిబ్బందిని సన్మానించిన అధికారులు. అంకితభావం,క్రమశిక్షణ, ప్రజాసేవలో వారి సేవలను కొనియాడిన జిల్లా ఎస్పీ. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్ష. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ (పరిపాలన) వెంకటరావు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బందికి ఘనంగా వీడ్కోలు మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన డీఎస్పీ కె.జె.ఎం. చిరంజీవి (డీఏఆర్, తిరుపతి), ఏఎస్ఐ ఎన్. సుధాకర్ చౌదరి (ట్రాఫిక్,తిరుమల) జి. సుధాకర్ (గాజులమండ్యం పీఎస్) కె. నారాయణ (ఎయిర్‌పోర్ట్ పీఎస్), ఏఎస్ఐ జి. భాస్కర్ నాయుడు (ఎయిర్‌పోర్ట్ పీఎస్), జి. ఆనందుడు (తిరుమల-1 టౌన్ పీఎస్), ఏఎస్ఐ జి. అశోక్ ఆనంద్ రాజ్ (తిరుమల-2 టౌన్ పీఎస్) మరియు హెడ్ కానిస్టేబుల్ ఎస్. పరమేశ్వర రెడ్డి (వెస్ట్ పీఎస్) లను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేసి వారి సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సందేశం ఇస్తూ "పదవీ విరమణ అనేది ఒక ఉద్యోగ జీవితానికి ముగింపు అయినప్పటికీ, సమాజానికి అందించిన సేవలకు శాశ్వత గుర్తింపు. పదవీ విరమణ పొందుతున్న అధికారులు, సిబ్బంది తమ సుదీర్ఘ సేవా కాలంలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువచ్చారు. ప్రజల భద్రత కోసం వారు చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. వారి అనుభవం యువ పోలీసు సిబ్బందికి మార్గదర్శకంగా నిలుస్తుంది. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని తెలిపారు.

ఈ కార్యక్రమంలొ అదనపు ఎస్పీ లు శ్రీ వెంకటరావు (పరిపాలన) శ్రీనివాసులు (క్రైమ్స్) వారు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం ఉద్దేశించి అదనపు ఎప్సీ వెంకట్రావు మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బంది తమ సేవా కాలంలో శాఖ అభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయమని, వారి భవిష్యత్ జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షులు సోము మరియు శంకర్ రెడ్డి, శేఖర్,సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story