Renigunta: రేణిగుంటలో పోలీసుల విస్తృత అవగాహన సదస్సులు - అప్రమత్తతే రక్షణ!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ డివిజన్‌లో సైబర్ మోసాలు, డ్రగ్స్, రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమాలు. డయల్-112, శక్తి యాప్‌పై ప్రజలకు సూచనలు.
Renigunta: రేణిగుంటలో పోలీసుల విస్తృత అవగాహన సదస్సులు - అప్రమత్తతే రక్షణ!
Renigunta: జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాలతో తిరుపతి జిల్లా పోలీసు శాఖ ప్రజా భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాలు, ఆర్టీసీ బస్‌స్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ప్రజలతో నేరుగా మాట్లాడి పలు అంశాలపై అవగాహన కల్పించారు.
రేణిగుంట ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో రక్షక్-8 సిబ్బంది ప్రయాణికులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, చైన్ స్నాచింగ్‌పై సూచనలు చేశారు. ప్రయాణ సమయంలో నగదు, మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.
వల్లూరుపల్లి గ్రామంలో హెల్మెట్ ధారణ, డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణ, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. కొత్తపల్లి గ్రామంలో మహిళలు, బాలికల భద్రత, డ్రగ్స్ దుష్పరిణామాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112, మహిళలు, బాలికలు శక్తి యాప్‌ను వినియోగించాలని సూచించారు.
అపరిచిత లింకులు, అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ చెప్పవద్దని పోలీసులు హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయం, వినియోగం, అక్రమ రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
మంగళంపల్లి పంచాయతీలో రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యం.. నేరాల నియంత్రణే ధ్యేయం అన్నట్టుగా జిల్లా వ్యాప్తంగా పోలీసుల అవగాహన కార్యక్రమాలు జరిగింది .




