Tirupati: తిరుపతిలో పోలీసుల మెగా డ్రగ్స్ టెస్టింగ్ డ్రైవ్..

Tirupati: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు నగరంలోని ఇందిరా మైదానంలో మెగా డ్రగ్స్ టెస్టింగ్ కార్యక్రమం నిర్వహించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 6 Jun 2026 9:23 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతిలో పోలీసుల మెగా డ్రగ్స్ టెస్టింగ్ డ్రైవ్..

తిరుపతి: పోలీసుల ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఇందిరా మైదానంలో మెగా డ్రగ్స్ టెస్టింగ్ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనుమానిత వ్యక్తులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించి, మత్తు పదార్థాల వినియోగదారులను గుర్తించారు.

పాజిటివ్‌గా తేలిన వారికి కౌన్సిలింగ్ అందిస్తూ మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.అదే సమయంలో రౌడీషీటర్లు,అనుమానిత వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి నేరాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మరోవైపు బాలాజీ కాలనీలోని పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలలో శక్తి టీమ్ మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. శక్తి యాప్ వినియోగం, ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, లోన్ యాప్ మోసాలు, మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు వివరించారు.

"డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా" లక్ష్యంతో ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే 1972 (ఈగల్) లేదా 112కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story