Renigunta: పల్లెనిద్రలో పోలీస్ అధికారులు.. గ్రామస్తులకు అవగాహన!
Renigunta: తిరుపతి జిల్లా గాజులమండ్యం పరిధిలోని విప్పమనుపట్టెడ గ్రామంలో పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు.
Renigunta: పల్లెనిద్రలో పోలీస్ అధికారులు.. గ్రామస్తులకు అవగాహన!
రేణిగుంట: పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్పమనుపట్టెడ గ్రామాన్ని రేణిగుంట ఎస్ డీ పీ ఓ శ్రీ శ్రీనివాసరావు,గాజులమండ్యం సీఐ శ్రీ మంజునాథ రెడ్డి శుక్రవారం రాత్రి సందర్శించారు.గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గుర్తుతెలియని ఫోన్ కాల్స్, మెసేజ్‌లు,లింక్‌లను నమ్మవద్దని,బ్యాంక్ ఖాతా వివరాలు,ఓటీపీ లు,పాస్‌వర్డ్‌లను ఎవరికీ వెల్లడించవద్దని అవగాహన కల్పించారు.మహిళలు,బాలికల భద్రత కోసం శక్తి యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
గ్రామాల్లో దొంగతనాలు,ఆస్తి నేరాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని,నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ డి పి ఓ శ్రీనివాసరావు,సీఐ మంజునాథ రెడ్డి తెలిపారు.




