Tirupati: నయం చేయడం కంటే నివారణే మేలు: డా. రమేష్ రెడ్డి
Tirupati: మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన సదస్సు జరిగింది. వ్యాధిని నయం చేయడం కంటే నివారణే మేలని డా. రమేష్ రెడ్డి పేర్కొన్నారు.
Tirupati: నయం చేయడం కంటే నివారణే మేలు: డా. రమేష్ రెడ్డి
Tirupati: మోహన్ బాబు విశ్వవిద్యాలయంలోని ఎం.బి. స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో చాన్సలర్, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్, ప్రో చాన్సలర్ మంచు విష్ణుల పర్యవేక్షణలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొని, రొమ్ము క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, స్క్రీనింగ్ పరీక్షలు, ఆధునిక చికిత్సా విధానాలపై అవగాహన పొందారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒమేగా హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజిస్ట్ డా. ఆర్. రమేష్ రెడ్డి, శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్‌కు చెందిన మెడికల్ ఆంకాలజిస్ట్ డా. పి. నాగేశ్వర రెడ్డి ఎంబీయూ వైస్ ఛాన్సలర్ పి.వి. రమణ, రిజిస్ట్రార్ సారథి'లు పాల్గొన్నారు.
అనంతరం డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, వ్యాధిని నయం చేయడం కంటే నివారణే ఎప్పుడూ మెరుగైనదన్నారు. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్ వంటి వ్యాధులన్నీ నివారించదగినవేనని, భవిష్యత్ తరాల కోసం ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
వర్సిటీలోని మౌలిక సదుపాయాలను చూసి ఆశ్చర్యపోయానని, వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీన్ డా. జయప్రకాష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వి. హేమలత, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.




