Renigunta: హెచ్ఎంటీవీ కథనానికి స్పందన: రేణిగుంట సీఐ జయచంద్ర చొరవ!
Renigunta: హెచ్ఎంటీవీ కథనానికి స్పందించిన రేణిగుంట పట్టణ సీఐ జయచంద్ర స్వయంగా చొరవ తీసుకొని ఫ్లైఓవర్‌పై గుంతలకు మరమ్మతులు చేపట్టడంతో వాహనదారులకు ఊరట లభించింది.
Renigunta: హెచ్ఎంటీవీ కథనానికి స్పందన: రేణిగుంట సీఐ జయచంద్ర చొరవ!
రేణిగుంట: ప్రజా సమస్యల పరిష్కారంలో తక్షణమే స్పందించి బాధ్యతాయుతంగా వ్యవహరించిన రేణిగుంట పట్టణ సీఐ జయచంద్ర స్థానికుల ప్రశంసలు అందుకున్నారు. రేణిగుంట ఫ్లైఓవర్‌పై ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనం ద్వారా వెలుగులోకి తీసుకురాగా, దీనిపై సీఐ జయచంద్ర వెంటనే స్పందించారు.
ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన స్వయంగా చొరవ తీసుకొని ఫ్లైఓవర్‌పై గుంతల మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సమస్య పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. దీంతో ఫ్లైఓవర్‌పై గుంతల సమస్యకు పరిష్కారం లభించి వాహనదారులకు ఊరట కలిగింది.
ఒకవైపు పోలీసు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూనే, మరోవైపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి వాటి పరిష్కారానికి చొరవ చూపడం సీఐ జయచంద్ర బాధ్యతాయుతమైన పనితీరుకు నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యను తన సమస్యగా భావించి స్వయంగా స్పందించి పరిష్కారానికి కృషి చేసిన ఆయనపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.




