Tirupati: తిరుపతిలో ప్రీమేథాన్ వాక్-2026లో పాల్గొన్న పులివర్తి సుధారెడ్డి!
Tirupati: ప్రపంచ నెలలు నిండని జననాల దినోత్సవం సందర్భంగా తిరుపతి ఎం.ఆర్. పల్లి సర్కిల్‌లో నిర్వహించిన ప్రీమేథాన్ వాక్-2026లో పులివర్తి సుధారెడ్డి పాల్గొన్నారు. అకాల జననాలపై అవగాహన కల్పించారు.
Tirupati: తిరుపతిలో ప్రీమేథాన్ వాక్-2026లో పాల్గొన్న పులివర్తి సుధారెడ్డి!
Tirupati: ప్రపంచ నెలలు నిండని జననాల దినోత్సవం సందర్భంగా చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు భరోసా కల్పించేలా ప్రీమేథాన్ వాక్ – 2026లో పాల్గొన్న పులివర్తి సుధారెడ్డి.
నవంబర్ 15 ప్రపంచ నెలలు నిండని జననాల దినోత్సవం సందర్భంగా అకాల జననాలపై అవగాహన కల్పించడం, నెలలు నిండకుండా జన్మించే చిన్నారులకు మెరుగైన వైద్య సంరక్షణ అందించాల్సిన అవసరాన్ని తెలియజేయడం, వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ఆయు ఫౌండేషన్, అంకుర హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఎం.ఆర్. పల్లి సర్కిల్‌లో నిర్వహించిన ప్రీమేథాన్ వాక్ – 2026 కార్యక్రమంలో పులివర్తి సుధారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుధా రెడ్డి మాట్లాడుతూ నెలలు నిండకుండా జన్మించిన చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురికాకుండా, వారికి అవసరమైన వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు, ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రతి చిన్నారికి మెరుగైన వైద్యం అందించి ఆరోగ్యంగా ఎదిగేలా చూడటమే మనందరి లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్, కార్పొరేటర్ పృథ్వి, అంకుర హాస్పిటల్ ప్రతినిధులు, వైద్య సిబ్బంది, పలువురు సభ్యులు పాల్గొన్నారు.




