Renigunta: కుర్రకాలువలో 'మన ఊరు-మన జెండా' కార్యక్రమం ప్రారంభం!

Renigunta: రేణిగుంట మండలం కుర్రకాలువలో 'మన ఊరు-మన జెండా' కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 28 Aug 2026 7:22 PM IST
Renigunta
X

Renigunta: కుర్రకాలువలో 'మన ఊరు-మన జెండా' కార్యక్రమం ప్రారంభం!

Renigunta: బీజేపీ పార్టీ సిద్ధాంతాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.

రేణిగుంట మండలం కుర్రకాలువ గ్రామంలో బీజేపీ నాయకుడు కుర్రకాలువ వేణు ఆధ్వర్యంలో ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీవీఎన్ మాధవ్ హాజరయ్యారు.ఆయనకు పార్టీ నాయకులు,కార్యకర్తలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు.

ముందుగా పీవీఎన్ మాధవ్ బీజేపీ ‘మన ఊరు–మన జెండా’ స్థూపాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామీణ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తలను ప్రోత్సహిస్తున్న వేణు ముదిరాజు ఏర్పాట్లను ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ..గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాటిని ప్రతి గ్రామానికి చేరేలా కృషి చేయాలన్నారు.

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, రాబోయే రోజుల్లో బీజేపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులురాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ బీడీ బాలాజీ,రాష్ట్ర ఎన్నికల క్షత్రియ డైరెక్టర్ జిపాలెం తేజవతి,బీజేపీ నాయకులు రాజా రాయల్,నరేష్ తదితర మండల నాయకులు,

కార్యకర్తలు,స్థానికులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story