Renigunta: రేణిగుంటలో రైల్వే ఉద్యోగి అనుమానాస్పద మృతి..
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్ (CRS) ఉద్యోగి కిల్లి రవి తన గదిలో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందాడు.
Renigunta: రేణిగుంటలో రైల్వే ఉద్యోగి అనుమానాస్పద మృతి..
రేణిగుంట: సీఆర్ఎస్ (క్యారేజ్ రిపేర్ షాప్)లోని సీబీఆర్ సెక్షన్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న కిల్లి రవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజమండ్రి సమీపంలోని కడియపులంకకు చెందిన రవి రేణిగుంట బుగ్గ వీధిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
మంగళవారం తన గదిలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
Next Story




