Railway Kodur: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఐ చంద్రశేఖర్

Railway Kodur: రైల్వే కోడూరులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఐ చంద్రశేఖర్. మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష.

PRASAD, KODURU
Published on: 5 Oct 2026 7:18 PM IST
Railway Kodur
X

Railway Kodur: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఐ చంద్రశేఖర్

రైల్వే కోడూరు: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు , రేణిగుంట డిఎస్పి వై శ్రీనివాస రావు ఆదేశాల మేరకు రైల్వే కోడూరు సి ఐ చంద్రశేఖర్ మండల సముదాయంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రహరీ గోడలు ,విద్యుత్ సౌకర్యం, తాగునీరు, మరుగుదొడ్లు మొదలైన సౌకర్యాల గురించి పరిశీలించినట్లు వెల్లడించారు.

పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలను, భద్రతాపరమైన, ఎన్నికల సమయంలో సమయం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

PRASAD, KODURU

PRASAD, KODURU