Koduru: రైల్వేకోడూరులో మోడిఫైడ్ సైలెన్సర్లు ధ్వంసం
Koduru: రైల్వేకోడూరులో అధిక శబ్దం చేసే 50 మోడిఫైడ్ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కి ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
Koduru: రైల్వేకోడూరులో మోడిఫైడ్ సైలెన్సర్లు ధ్వంసం
కోడూరు: రైల్వేకోడూరు పట్టణంలో బుల్లెట్ తదితర ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చే విధంగా అమర్చిన మోడిఫైడ్ సైలెన్సర్లను పోలీసులు తొలగించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, IPS గారి ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో, రైల్వేకోడూరు టౌన్ సీఐ శ్రీ చంద్రశేఖర్ గారు మరియు సిబ్బంది పట్టణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వాహనాల నుంచి అధిక శబ్దం చేసే సైలెన్సర్లను తొలగించారు.
ఈ రోజు కోడూరు టౌన్ దగ్గర గల లవ్ టీ స్టాల్ సమీపంలో సీజ్ చేసిన 50 సైలెన్సర్లను రోడ్ రోలర్ సహాయంతో తొక్కించి ధ్వంసం చేశారు.
వాహనాలకు అధిక శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్లను మార్పులు చేసి అమర్చడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగడంతో పాటు, శబ్ద కాలుష్యం మరియు రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇకపై ఇలాంటి సైలెన్సర్లను ఉపయోగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు వాహనాలను కంపెనీ నిబంధనల ప్రకారం మాత్రమే వినియోగించి, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా మార్పులు చేయవద్దని పోలీసులు సూచించారు.




