Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే శిరీషాదేవి!

Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి దర్శించుకున్నారు.

Prasanna, Rampachodavaram
Published on: 22 Aug 2026 5:01 PM IST
Tirumala
X

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే శిరీషాదేవి!

తిరుమల: రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి శనివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే శిరీషాదేవి స్వామివారి సుప్రభాత సేవ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారి దర్శనం చేసుకున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వారు పేర్కొన్నారు. రంపచోడవరం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే శిరీషాదేవి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన విషయం తెలుసుకున్న పలువురు భక్తులు ఆమెను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాల ప్రకారం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆమె ఆలయం నుంచి బయలుదేరారు. గిరిజనుల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి మరింత శక్తితో పనిచేసేలా స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించినట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story