Rayachoti: రాయచోటిలో ఎన్నారై అన్నదాన సేవలు
Rayachoti: రాయచోటి చెన్నముక్కపల్లి లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం
Rayachoti: రాయచోటిలో ఎన్నారై అన్నదాన సేవలు
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి మండల పరిధిలోని చెన్నముక్కపల్లి గ్రామంలో గల లయన్స్ కంటి ఆసుపత్రిలో ఆదివారం జరిగిన కంటి వైద్య శిబిరంలో 18 మంది కంటి రోగులకు ఆపరేషన్లు నిర్వహించారు.ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంతో పాటు రాజంపేట,రైల్వే కోడూరు,సుండుపల్లె,వీరబల్లి,యర్రావారిపాలెం,కేవీపల్లి,కలకడ,కలికిరి,పీలేరు,గుర్రంకొండ,పెద్దమండెం,ఎన్.పి.కుంట,చక్రాయపేట,కడప తదితర ప్రాంతాల నుండి వచ్చిన 40 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించిన కంటి వైద్యులు అందులో అర్హులైన 18 మంది కంటి రోగులకు ఆపరేషన్లు నిర్వహించారు.
అలాగే గతంలో ఆపరేషన్ చేయించుకున్న 45 మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు,మందులు పంపిణీ చేశారు.అనంతరం కంటి ఆపరేషన్ల కోసం వచ్చిన కంటి రోగులతో పాటు వారి వెంట ఉన్న సహాయకులకు గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీలోని మొటుకు గ్రామానికి చెందిన దాత,ఎన్నారై ఎర్రగొండ గోవర్ధన్ రెడ్డి సహకారంతో అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో లయన్స్ కంటి ఆసుపత్రి చైర్మన్ వైవిఆర్ స్వరూప్ గుప్తా,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెన్నూరు అన్వర్ భాష,ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి,న్యాయవాది గాలివీటి పవనిశ్ రెడ్డి,కంటి వైద్యులు సురేష్ బాబు,భార్గవి,ఆత్మాలిక్ అసిస్టెంట్ మూలి రాజగోపాల్ రెడ్డి,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




