Renigunta: రేణిగుంటలో ఆద్య వైన్స్ తొలగించాలని ఐద్వా ధర్నా!
Renigunta: రేణిగుంటలో ఆద్య వైన్స్ తొలగించాలని ఐద్వా, ప్రజా సంఘాల ధర్నా. వైన్స్ తొలగించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే జోక్యం.
Renigunta: రేణిగుంటలో ఆద్య వైన్స్ తొలగించాలని ఐద్వా ధర్నా!
రేణిగుంట: రేణిగుంట పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆద్య వైన్స్, సర్వేశ్ వైన్స్ మద్యం దుకాణాలను తక్షణమే తొలగించాలని ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం పంచాయతీ కార్యాలయం వద్ద ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.
సమావేశంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాయి లక్ష్మి మాట్లాడుతూ, నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఉండటం వల్ల మహిళలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి జోక్యం చేసుకుని ఈ మద్యం దుకాణాలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం ప్రజా సంఘాల నాయకులు, మహిళలు పంచాయతీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఆద్య వైన్స్ దుకాణం ఎదుట ధర్నా నిర్వహించారు. మద్యం దుకాణాలను తొలగించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి నిరవధిక నిరాహార దీక్షలు సహా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడతామని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కొండ్రెడ్డి ఈశ్వరమ్మ, మండల అధ్యక్షురాలు బి. భారతి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కొండ్రెడ్డి ఈశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాయి లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యశ్రీ, వేణుగోపాలపురం కార్యదర్శి అమ్ములు, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు మల్లేశ్వరి, ఆటో యూనియన్ నాయకులు దీపా, హేమనాథ్, బిల్డింగ్ యూనియన్ కార్యదర్శి రాజశేఖర్, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, రేవతి, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మావతి, సంఘమిత్ర యూనియన్ నాయకురాలు మనీలా, ఏకలవ్య ఎరుకుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టేటి ప్రసాద్, గిరిజన ఉద్యోగ సంఘం కార్యదర్శి రమణ, గిరిజన సంఘం నాయకురాలు సులోచన, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరమణ, సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కె. హరినాథ్‌తో పాటు స్థానిక మహిళలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




