Renigunta: ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం – గర్భిణులకు పసుపు-కుంకుమ సత్కారం
Renigunta: రేణిగుంటలో అంగన్‌వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గర్భిణులకు పసుపు-కుంకుమ పెట్టి సత్కరించి, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.
Renigunta: ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం – గర్భిణులకు పసుపు-కుంకుమ సత్కారం
రేణిగుంట: రేణిగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర వన్నె కుల డైరెక్టర్ తేజవతి, బీడీ బాలాజీ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి సిడిపిఓ కృష్ణవేణి గర్భిణీ స్త్రీలకు పసుపు–కుంకుమ పెట్టి, వారిని సత్కరించడంతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా గర్భిణుల ఆరోగ్యం, పౌష్టికాహారం, తల్లి–బిడ్డ సంరక్షణపై అవగాహన కల్పించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం ప్రాధాన్యత, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను వివరించారు. పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, బాలల ప్రాథమిక విద్యలో అంగన్వాడీ కార్యకర్తల సేవలు కీలకమని కార్యక్రమంలో పేర్కొన్నారు.
అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా దీదీలను ఘనంగా సత్కరించారు. వారి సేవలను అభినందిస్తూ శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీజేపీ నాయకుడు సామంచి శ్రీనివాస్ పాల్గొని సిబ్బందిని అభినందించారు.
కార్యక్రమంలో బిజెపి నాయకులు బిడి బాలాజీ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నరేష్, పురుషోత్తం రెడ్డి,అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, మహిళలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.




