Renigunta: గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: గురువారెడ్డి!

Renigunta: రేణిగుంట శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 20 Aug 2026 11:41 PM IST
Renigunta
X

Renigunta: గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: గురువారెడ్డి!

రేణిగుంట: రేణిగుంట శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, పుస్తకాలు, యాప్ పనితీరును పరిశీలించి పాఠకులతో మాట్లాడారు.

గ్రంథాలయంలో సుమారు 17 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు కూడా ఉన్నాయని తెలిపారు. అవసరమైన అదనపు పుస్తకాలను తిరుపతి నుంచి తీసుకువచ్చి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. గ్రంథాలయ యాప్‌ను పాఠకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి నాగరాణి పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story