Renigunta: ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జీకి వ్యతిరేకంగా సీపీఎం నిరసన!
Renigunta: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీకి వ్యతిరేకంగా రేణిగుంటలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Renigunta: ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జీకి వ్యతిరేకంగా సీపీఎం నిరసన!
రేణిగుంట: నీట్ ప్రశ్నాపత్రం లీక్ పై డిల్లీలో శాంతీయుతంగా చేస్తున్న నిరసన పై విక్షచనా రహితంగా జరిపిన లాఠీచార్జికి వ్యతిరేకంగా, రేణిగుంట సిపియం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసారు.ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కొండ్రెడ్డి ఈశ్వరమ్మ మాట్లాడుతూ ధర్మేందర్ ప్రధాని కేంద్రం విద్యా మంత్రి గా వచ్చిన తరువాత 22 సార్లు పరిక్షల వైఫల్యం జరిగినా సిగ్గు లేకుండా ధర్మేందర్ ప్రధాని కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవి కొన సాగించడం దుర్మార్గం అన్నారు.
జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు ఓ.వెంకటరమణ, మాట్లాడుతూ నీట్ లీకేజీ కారణంగా అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.విద్యార్థుల,ప్రముఖ సామాజిక వేత్త,విద్యా ప్రయోగశీలి సోనమ్ వాంగ్ చూక్ నిరసన దీక్షను బలవంతంగా భగ్నం చేశారు.కేంద్ర విద్య శాఖా మంత్రి ధర్మేందర్ ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సిఐటియు మండల కార్యదర్శి శెల్వరాజు మాట్లాడుతూ డిల్లీలో శాంతీయుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై దాడి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించి రాజీనామా చేయాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నేతలు ఈశ్వరమ్మ,సెల్వరాజు,వెంకటరమణ,దిలీప్ భాషా,రాజశేఖర్, మునిస్వామి,సులోచన,దస్తగిరి, సుబ్రమణ్యం,ఎర్రస్వామి, గురుమూర్తి,శివ,నాగూర్, జయరామయ్య తదితరులు పాల్గొన్నారు.




