Renigunta: విద్యుత్ తీగలపై ఇనుప ఫ్రేమ్.. భయాందోళనలో స్థానికులు

Renigunta: రేణిగుంటలో గాలి వాన ధాటికి ఒక ఇనుప నిర్మాణం ఎగిరివచ్చి విద్యుత్ తీగలపై వేలాడుతోంది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 3 May 2026 8:53 PM IST
Renigunta
X

Renigunta: విద్యుత్ తీగలపై ఇనుప ఫ్రేమ్.. భయాందోళనలో స్థానికులు

Renigunta: రేణిగుంట పట్టణంలో కురిసిన భారీ గాలి వాన ప్రభావంతో ఓ ఇనుప నిర్మాణం ఎగిరి ప్రైవేట్ తీగలపై పడిపోయి ప్రమాదకరంగా వేలాడుతున్న ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. రద్దీగా ఉండే వీధిలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం ప్రజలను వెంటాడుతోంది. వాహనదారులు, పాదచారులు నిరంతరం రాకపోకలు సాగించే ఈ మార్గంలో ఇలాంటి పరిస్థితి తీవ్ర ప్రమాదానికి దారి తీసే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.

ముఖ్యంగా గాలి మళ్లీ వేగంగా వీచినా, వర్షం కురిసినా ఈ ఇనుప నిర్మాణం కిందపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రమాదకర పరిస్థితిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.లేదంటే చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీసి “ఆదమరిస్తే ఆసుపత్రి పాలు” అనే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story