Renigunta: మద్యం తాగి వాహనం నడిపిన యువకుడికి జైలు శిక్ష, జరిమానా
Renigunta: రేణిగుంటలో మద్యం తాగి వాహనం నడిపిన యువకుడికి తిరుపతి కోర్టు రూ. 10 వేల జరిమానా, 7 రోజుల జైలు శిక్ష విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల హెచ్చరిక.
Renigunta: మద్యం తాగి వాహనం నడిపిన యువకుడికి జైలు శిక్ష, జరిమానా
రేణిగుంట: మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఓ యువకుడికి తిరుపతి స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు రూ.10,000 జరిమానాతో పాటు 7 రోజుల సాధారణ కారాగార శిక్ష విధించింది.
రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ (పెట్టీ కేసు)లో నిందితుడు కోర్టులో హాజరై తన నేరాన్ని అంగీకరించాడు. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185(a) కింద నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో, గౌరవనీయులైన స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి నిందితుడిని దోషిగా నిర్ధారించింది.
ఈ మేరకు నిందితుడు జి. మస్తాన్ (25), తండ్రి చిన్నబాబు, నివాసం వడమాలపేట, తిరుపతికు రూ.10,000 జరిమానా విధించడంతో పాటు 7 రోజుల సాధారణ కారాగార శిక్ష (Simple Imprisonment)ను కోర్టు విధించింది.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని రేణిగుంట అర్బన్ పోలీసులు సూచించారు.




