Renigunta: గంగమ్మ అమ్మవారికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సారె సమర్పణ!

Renigunta: వైభవంగా జరుగుతున్న శ్రీ గంగమ్మ అమ్మవారి జాతరలో తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని సాంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 18 Aug 2026 11:50 PM IST
Renigunta
X

Renigunta: గంగమ్మ అమ్మవారికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సారె సమర్పణ!

రేణిగుంట: పట్టణంలో వైభవంగా జరుగుతున్న శ్రీ గంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో తుడా ఛైర్మన్,టీటీడీ ఎక్స్‌అఫిషియో సభ్యుడు,టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక యువత,నాయకులు, భక్తులు బాణసంచాతో ఘన స్వాగతం పలికారు.అనంతరం డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు-కుంకుమ, పూలు, పండ్లతో కూడిన ప్రత్యేక సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

అమ్మవారి సేవలో పాల్గొని సారె సమర్పించే భాగ్యం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని ఆయన పేర్కొన్నారు.శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో నియోజకవర్గ, జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు,అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ప్రతి ఏటా భక్తిశ్రద్ధలు, ఐకమత్యంతో గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తున్న స్థానిక ప్రజలు,యువత,ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,టీడీపీ నాయకులు,కార్యకర్తలు,తెలుగు యువత ప్రతినిధులు,భక్తులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story