Renigunta: రేణిగుంట గ్రామ సభలో పారిశుద్ధ్య సమస్యలపై వినతులు!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట గ్రామ సభలో పారిశుద్ధ్య సమస్యలపై అధికారులను నిలదీసిన ప్రజలు. చెత్త తొలగింపు, కాలువల శుభ్రీకరణకు వినతి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 2 Oct 2026 1:52 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట గ్రామ సభలో పారిశుద్ధ్య సమస్యలపై వినతులు!

Renigunta: రేణిగుంటలో నిర్వహించిన గ్రామ సభకు మహిళలు, గ్రామ ప్రజలు భారీగా హాజరయ్యారు. గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని అధికారులను ప్రజలు కోరారు.

వీధుల్లో పేరుకుపోతున్న చెత్తను సకాలంలో తొలగించాలని, చెత్తకుండీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కాలువలను శుభ్రపరిచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని గ్రామ సభలో ప్రజలు విన్నవించారు. ఈ గ్రామ సభలో కాంగ్రెస్ నాయకుడు వీఆర్ రామనన్‌తో పాటు సీపీఎం, సీపీఐ, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA