Renigunta: విద్యార్థులకు ఉచిత డిక్షనరీల పంపిణీ!

Renigunta: రేణిగుంట గుత్తివారిపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు లూయెనా ఫౌండేషన్, పద్మ మహిళా మండలి ఆధ్వర్యంలో ఉచిత డిక్షనరీల పంపిణీ.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 17 July 2026 4:47 PM IST
Renigunta
X

Renigunta: విద్యార్థులకు ఉచిత డిక్షనరీల పంపిణీ!

Renigunta: రేణిగుంట మండలంలోని గుత్తి వారి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 70 మంది విద్యార్థులకు శుక్రవారం యు ఎస్ ఏ లూయెనా ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో కడప జిల్లా ఖాజీపేట కు చెందిన పద్మ మహిళా మండలి ఆధ్వర్యంలో డిక్షనరీలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పద్మ మహిళా మండలి ప్రాజెక్టు ఆఫీసర్ జూలియన్ రాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంగ్లీష్ భాష పై పట్టు సాధించాలన్న ఉద్దేశంతో తమ వంతు సహాయంగా డిక్షనరీలను పంపిణీ చేసామని అన్నారు.విద్యార్థులు క్రమం తప్పకుండా నిత్యం ఒక్క పదం నేర్చుకుంటే ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందని తెలిపారు.

ప్రధాన ఉపాధ్యాయుడు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సేవ చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు.డిక్షనరీలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నూర్ అహ్మద్,జ్యోతిర్మయి, పురుషోత్తం,సుబ్రహ్మణ్యం, పద్మలత తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story