Renigunta: మద్యం దుకాణం వద్ద రోడ్డుపైనే పార్కింగ్.. వాహనదారుల ఇబ్బందులు!
Renigunta: రేణిగుంట చెక్‌పోస్ట్ రోడ్డులోని మద్యం దుకాణం వద్ద రోడ్డుపైనే వాహనాల నిలిపివేత. తీవ్ర ట్రాఫిక్ సమస్యతో వాహనదారుల ఆవేదన, అధికారుల చర్యలకు డిమాండ్.
Renigunta: మద్యం దుకాణం వద్ద రోడ్డుపైనే పార్కింగ్.. వాహనదారుల ఇబ్బందులు!
రేణిగుంట: పట్టణంలోని చెక్‌పోస్ట్‌కు వెళ్లే మార్గంలో ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద వాహనాల పార్కింగ్ సమస్య వాహనదారులకు ఇబ్బందిగా మారుతోంది.మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చే కస్టమర్లు తమ ద్విచక్ర వాహనాలను ప్రధాన రహదారిపైనే నిలుపుతుండటంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రద్దీగా ఉండే ఈ మార్గంలో రోడ్డుపై వాహనాలను నిలపడం వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు స్పందించి,ప్రధాన రహదారిపై వాహనాల పార్కింగ్‌ను నియంత్రించి,ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.




