Renigunta: రేణిగుంటలో సర్పంచ్ అభ్యర్థి చిత్రకు మద్దతుగా ఎమ్మెల్యే బొజ్జల ప్రచారం

Renigunta: రేణిగుంట పట్టణంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కె. చిత్రకు మద్దతుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 23 Nov 2026 4:28 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో సర్పంచ్ అభ్యర్థి చిత్రకు మద్దతుగా ఎమ్మెల్యే బొజ్జల ప్రచారం

రేణిగుంట: రేణిగుంట పట్టణంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కె. చిత్రకు మద్దతుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలిసి చిత్రకు మద్దతు తెలపాలని కోరారు.

ఈ సందర్భంగా కె. చిత్రను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఎన్నికల గుర్తుల్లో వరుస నంబర్ 1లో ఉన్న మంచం గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి విజయాన్ని అందించాలని ఎమ్మెల్యే ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA