Renigunta: చెంచు క్రికెట్ టర్ఫ్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి!
Renigunta: రేణిగుంట తూకివాకంలో క్లబ్ బాక్స్ క్రికెట్ టర్ఫ్‌ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.
Renigunta: చెంచు క్రికెట్ టర్ఫ్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి!
రేణిగుంట: రేణిగుంట మండలంలోని తూకివాకం పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్లబ్ బాక్స్ క్రికెట్ టర్ఫ్‌ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, డాక్టర్ డాలర్ దివాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మౌర్య, రవి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించి ప్రోత్సహించారు.
యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని వారు పేర్కొన్నారు. యువ క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇలాంటి క్రీడా వేదికలు దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట మండలాధ్యక్షుడు ముని చంద్రారెడ్డి,ఎస్ రవి రెడ్డి, నర్మదా, మౌర్య, భాస్కర్ యాదవ్, నాగమణి రెడ్డి, చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చౌదరి,గోపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,గోపి, శివ, నాగరాజు, గణపతి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.




