Renigunta: రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీ సీఈఓ ఆకస్మిక తనిఖీ!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో చిత్తూరు జడ్పీ సీఈఓ వి.రవికుమార్ నాయుడు ఆకస్మిక తనిఖీ.
Renigunta: రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీ సీఈఓ ఆకస్మిక తనిఖీ!
తిరుపతి జిల్లా: రేణిగుంట మండల ప్రజా పరిషత్తు కార్యాలయాన్ని చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్తు ముఖ్య కార్య నిర్వహణాధికారి వి.రవికుమార్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు.కార్యాలయంలో నిర్వహిస్తున్న పలు రికార్డులను పరిశీలించి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో రవిచంద్రతో సమావేశమై గ్రామ పంచాయతీల నిర్వహణ,అభివృద్ధి పనులపై చర్చించారు.పంచాయతీలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా కొన్ని సూచనలు చేశారు.అనంతరం కార్యాలయ సిబ్బందితో మాట్లాడిన ఆయన విధుల పట్ల నిబద్ధతతో పనిచేయాలని,ప్రజలకు సమయానికి సేవలు అందించాలని సూచించారు.కార్యాలయ పరిపాలన మరింత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Next Story




