Renigunta: రేణిగుంటలో శ్రీ వరసిద్ధి వినాయక ఆటో అసోసియేషన్ ఎన్నిక
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ ఆవరణలో శ్రీ వరసిద్ధి వినాయక ఆటో డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Renigunta: రేణిగుంటలో శ్రీ వరసిద్ధి వినాయక ఆటో అసోసియేషన్ ఎన్నిక
Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఆటో స్టాండ్ కు సంబంధించిన ఆటో డ్రైవర్లు, ఓనర్లు కలసి శుక్రవారం శ్రీ వరసిద్ధి వినాయక ఆటో డ్రైవర్స్, ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకున్నారు.
వైయస్సార్ సిపి సీనియర్ నాయకులు, డిసిసిబి మాజీ చైర్మన్ సిద్ధగుంట సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 83 మంది ఆటో ఓనర్లు, డ్రైవర్లు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడు మహేష్ బాబు,అధ్యక్షుడు వాసు, ఉపాధ్యక్షుడు రాముడు, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకం తో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆటో ఓనర్లు, డ్రైవర్ల సమస్వలను పరిష్కరించేందుకు నూతన అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు.
అందరి సహకారంతో అందరికీ ఆదర్శంగా, పారదర్శకంగా అసోసియేషన్ ను ముందుకు తీసుకొని వెళ్తామని అన్నారు. అనంతరం డిసిసిబి మాజీ చైర్మన్ సిద్ధగుంట సుధాకర్ రెడ్డి నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆటో ఓనర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు.




