Renigunta: రేణిగుంట పంచాయతీ ఎన్నికలు: 660 నామినేషన్లకు ఆమోదం!

Renigunta: రేణిగుంట మండలం 19 గ్రామపంచాయతీల ఎన్నికల్లో భాగంగా బుధవారం నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా, మొత్తం 950 నామినేషన్లలో 660 ఆమోదం పొంది 290 తిరస్కరణకు గురయ్యాయి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 18 Nov 2026 11:31 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట పంచాయతీ ఎన్నికలు: 660 నామినేషన్లకు ఆమోదం!

రేణిగుంట: రేణిగుంట మండలం గ్రామపంచాయతీ రెండో సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా రేణిగుంట మండల పరిధిలోని 19 గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. అధికారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం సర్పంచ్ స్థానాలకు మొత్తం 296 నామినేషన్లు స్వీకరించగా, వాటిలో 180 ఆమోదం పొందాయి. వివిధ కారణాలతో 116 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

అదేవిధంగా మండలంలోని 19 గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న 206 వార్డు స్థానాలకు సంబంధించి మొత్తం 654 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 480 నామినేషన్లు ఆమోదం పొందగా, 174 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ రెండు విభాగాల్లోనూ ఎలాంటి నామినేషన్లు పెండింగ్‌లో లేవని అధికారులు వెల్లడించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA