Renigunta: పిల్లల భద్రతపై జాగ్రత్తగా ఉండాలి.. రేణిగుంట పోలీసుల హెచ్చరిక
Renigunta: రేణిగుంటలో మహిళలు మరియు చిన్నారుల భద్రతపై తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భారీ అవగాహన సదస్సు నిర్వహించారు.
Renigunta: పిల్లల భద్రతపై జాగ్రత్తగా ఉండాలి.. రేణిగుంట పోలీసుల హెచ్చరిక
Renigunta: మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రేణిగుంట ఎంపీడీవో రవిచంద్ర, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ చక్రపాణి, అంగన్వాడీ, ఆశా వర్కర్స్, మహిళలు పాల్గొని రేణిగుంటలో సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పోలీసు అధికారులు,మహిళా సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా రేణిగుంట డీఎస్పీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, రక్షణ చర్యలపై వివరంగా అవగాహన కల్పించారు. మహిళలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా ‘స్త్రీ రక్ష’ పోర్టల్, ‘శక్తి టీమ్’ సేవలు, అత్యవసర సేవలైన 100, 112 నంబర్ల వినియోగంపై స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. మొబైల్ యాప్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని, మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లను వినియోగించుకోవాలని తెలిపారు.
క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్ నియంత్రణలో భాగంగా మహిళలు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు.ముఖ్యంగా రాత్రివేళల్లో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండటం,అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వడం,సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను పంచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చిన్నారుల భద్రతపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ, ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’పై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో సన్నిహితంగా ఉండి వారి ప్రవర్తనలో మార్పులను గమనించాలని, ఎటువంటి అనుమానాస్పద ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ జయచంద్ర, ఎస్ఐ ధర్మారెడ్డి,ఎంపీడీఓ రవిచంద్ర,పిహెచ్సి డాక్టర్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.




